Monday, February 23, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం నవ్వుతున్నారు

ఆద్యంతం నవ్వుతున్నారు

- Advertisement -

సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన చిత్రం ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా విశేష ఆదరణ పొందింది. ఇందులో ఓ కీలకపాత్రలో నటించిన కమెడియన్‌ సుదర్శన్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ పాత్రకు మంచి పేరొచ్చింది.

నా పాత్రకు ఇంపార్టెన్స్‌ వల్ల పాత్ర కూడా బాగా ఎలివేట్‌ అయ్యింది. డ్రింకింగ్‌ సీన్‌, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌ ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్‌, సుహాస్‌, నరేష్‌, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు. నేను హీరోగా ఇప్పుడే చేయను. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని వుంది. ‘మత్యుంజయ’తో పాటు ‘గొదావరి గట్టు మీద’లో కూడా మంచి పాత్రలు చేశాను’ అని సుదర్శన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -