దొంగకి మర్యాద
”లలితా, ఇంత రాత్రిపూట కాఫీ వాసన వస్తోందేమిటి?” నిద్ర కళ్ళతో భార్యని అడిగాడు రాజారావు.
”మన ఇంటికి దొగ వచ్చాడండి. అతనికి వేడిగా కాఫీ ఇద్దామని హాల్లో సోఫాలో కూర్చోబెట్టాను” అంది లలిత.
”పిచ్చిదానా! దొంగకు మర్యాద చేయడమేంటి?”
”అయ్యో రామా! అతను దొంగతనం చేయడానికి మనింటికి రాలేదుటండీ? పక్కింట్లో పడడానికి వచ్చాడట. అందుకని కాఫీ ఇచ్చి పంపేద్దామని” ఆనందంగా చెప్పింది లలిత.
మూఢనమ్మకం
అనసూయ: ఏమండీ! మూఢనమ్మకం అంటే ఏమిటండీ!
సత్యమూర్తి: నువ్వు ఎప్పటికైనా నా మాట వింటావనే ఆశతో నీతో కాపురం చేయడం.
జన్మలో చూడలేదు
డాక్టర్ : మాట పడిపోయిన పేషెంట్ పరిస్థితి ఏంటి?
నర్స్ : ఇవాళ ఉదయం కొద్దిగా మాట్లాడానికి ప్రయత్నించాడు డాక్టర్.
డాక్టర్ : ఏం మాట్లాడాడు?
నర్స్ : ఇంత దరిద్రమైన హాస్పిటల్ నా జన్మలో చూడలేదన్నాడు.
జిరాక్స్
వెంగళప్ప : ఐదు దినపత్రికలు ఇవ్వండి.
షాపు యజమాని : ఐదు లేవండి. ఒక్కటే ఉంది.
వెంగళప్ప : సరే, ఉన్న ఆ ఒక్కటే ఇవ్వండి. దాన్నే జిరాక్స్ కాపీలు తీయించుకుంటాను.



