నీదొక నస
బుడుగు : పరీక్ష హాలులో గమ్మున కూర్చుని ఉన్నాడు…
ఇంతలో ఇన్విజిలేటర్ చూసి అడిగింది….
ఇన్విజిలేటర్ : ఏంటీ ఏమైనది?
మనోడు సైలెంట్…
ఇన్విజిలేటర్ : ఏంటి, పెన్ మర్చిపోయావా?
మనోడు మళ్ళి సైలెంట్…
ఇన్విజిలేటర్ : అసలు ఏంటి విషయం …ఏం మర్చిపోయావో చెప్పు…
బుడుగు : నువ్వుండమ్మా తల్లీ…అసలే రేపటి స్లిప్పులు పొరపాటున ఇవాలే పెట్చుకొచ్చానని నేను బాధపడుతుంటే నీదొక నస ఇందాకటి నుండి……..
ఆశ్చర్యంగా
పప్పు వాళ్ల నాన్నతో : ” నాన్న నీవు ఎప్పుడు ఈజిప్టు వెళ్ళావు”
పప్పు వాళ్ల నాన్న : ” నేను ఎప్పుడూ ఈజిప్టు వెళ్లలేదు. అయిన నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది. ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వాళ్ళ నాన్న.
పప్పు: ”మరి మమ్మీని ఎక్కడ నుండి తీసుకొచ్చావు.
మా నాన్న ధైర్యవంతుడే
బంటి : అరేయ్ ‘అశోక్ చక్ర’ ఎవరికి ఇస్తార్రా?
బబ్లు : యుద్ధరంగంలో బాగా ధైర్య సాహసాలు చూపించి శ్రతువు ఎంతటివాడైనా భయపడకుండా ఉండేవారికి…
బంటి : అయితే ఒకటి మా నాన్నకు కూడా ఇవ్వాలిరా…
బబ్లు: అబ్బో అంత సాహసం ఏం చేశాడో మీ నాన్న…?
బంటి : నిన్న ‘నువ్వు అస్సలు బాలేవు… చాలా లావుగా ఉన్నావ్..’ అని మా అమ్మ మొహమ్మీదే చెప్పేశాడురా…
వాడు చెప్పాడా?
ఏవండి ! మీ స్నేహితుడికి మీరైనా చెప్పచ్చుగా తను చేసుకోబోయే ఆవిడ అస్సలు బాలేదు అని
ఏం ఫర్లేదు … నా పెళ్ళప్పుడు వాడు చెప్పాడా ఏంటి..
పులి పెండ్లి
ముస్తాబయి వెళుతున్న పిల్లిని ఎక్కడికని అడిగితే…
” మా తమ్ముడు పులి పెళ్ళికి” అంది.
” అదేమిటి నువ్వేమో పిల్లిలా ఉన్నావు. మీ తమ్ముడు పులి అంటావేమిటీ..?
” ఓ…అదా పెళ్ళికి ముందు నేను పులినే”
ఐలవ్‌యూ..
పేషెంట్ : మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
నర్స్ : ఇంగ్లీష్‌లో చెప్పు?
పేషెంట్ : ఐల్‌వ్‌యూ సిస్టర్
నర్స్ : ఐలవ్‌యూ బ్రదర్.
నువ్వు – నేను
గోపి : ఎప్పుడు చూసినా నాది, నావీ అంటావే కాని మనది, మనవి అని అనవేం..?
సరళ : అయితే సరే ఇవాళ మార్కెట్ కి వెళ్ళి మనం తొడుక్కోవడానికి గాజులు పట్రండి.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



