Sunday, March 1, 2026
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

టైం సరిపోవద్దూ!
టీచర్‌ : పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?
విద్యార్థి : కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్‌ కావాలిగా అందుకని..!

దొంగతనం
రాజేష్‌ : పొద్దున నుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?
సురేష్‌ : అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!

పది తక్కువ
కొడుకు : ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు నాన్నా…
తండ్రి : ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు : రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి : రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు : పది మార్కులు.

పిల్లలు మాత్రమే…
ఒక టూరిస్ట్‌ ఇండియాలో పర్యటిస్తూ ఒక గ్రామం గుండా వెళ్తూ గైడ్‌ని ఇలా అడిగాడు…
టూరిస్ట్‌ : ఈ గ్రామంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా?
గైడ్‌ : లేదండి. అందరూ చిన్న పిల్లలే పుట్టారు

మేకప్‌ మహిమ
‘వెల్డన్‌ మేడమ్‌! మా మందు మీకు బాగా పనిచేసింది. మీరు రెండు కిలోలు తగ్గారు’ అన్నాడు రిప్రజెంటేటివ్‌.
‘నీ మొహం!. ఈ రోజు నేను మేకప్‌ చేయలేదు’ అంది సుందరి.

ఉచిత సలహా
అరవై ఏళ్ల వ్యక్తి మ్యారేజ్‌ బ్యూరోకు వెళ్లాడు.
‘నేనో విధవను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.
‘అలాంటి సంబంధం దొరకడం ఇప్పటికిప్పుడు కష్టం. ముందైతే మీరు పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని కట్టుకున్న ఆవిడ కొన్ని రోజులకే ఆటోమెటిక్‌గా విధవ అయిపోతుంది లేండి’ సలహా ఇచ్చాడు ఏజెంట్‌.

చురుకైన వాడు
రామయ్య : మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు?
సోమయ్య : కలెక్టర్‌
రామయ్య : రెండో వాడు?
సోమయ్య : పోలీసాఫీసర్‌
రామయ్య : మూడో వాడు?
సోమయ్య : దొంగతనాలు
రామయ్య : ఇద్దరు అన్నయ్యలు గౌరవప్రదమైన వృత్తుల్లో ఉండగా చిన్నోడు దొంగతనాలు చేయడమేమిటి?’
సోమయ్య : వాడు దొంగతనాలు చేయబట్టే ఆ డబ్బుతో పెద్దోళ్లిద్దరు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించకోగలిగారు.

దూకలేడు.. ఎలా?
‘హలో… మా ఆయన కిటికీ లోంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు’ హౌటల్‌ గది నుంచి రిసెప్షన్‌కు ఫోన్‌ చేసింది ఓ మహిళ.
‘కంగారుపడకండి మేడమ్‌! మీ ఆయన ఆ అఘాయిత్యం చేసుకోకుండా మేం కాపాడుతాం’ భరోసా ఇచ్చాడు రిసెప్షనిస్ట్‌.
‘నేను నీకు ఫోన్‌ చేసింది కాపాడటానికి కాదురా నాయనా! కిటికీ తెరుచుకోవడం లేదేమిటని అడగడానికి’ విరుచుకుపడింది మహిళ.

మతిమరుపు
ప్రొఫెసర్‌ తన భార్యతో-
‘నాకు మతి మరుపు అని అంటుంటావుగా… ఈ రోజు నేనేం చేశానో చూడు’ అన్నాడు.
‘ఏం చేశారు?’ ఆసక్తిగా అడిగింది భార్య.
‘బజారుకు వెళ్లేటప్పుడు తోడుగా తీసుకెళ్లిన మన చంటిగాడిని మరచిపోకుండా తిరిగి ఇంటికి తీసుకొచ్చాను’ అన్నాడు ప్రొఫెసర్‌ గర్వంగా.
‘మీ మతిమరుపు మాడా.. అసలు మనకు పిల్లలే లేరు కదండీ…’ అంటూ విరుచుపడింది భార్య.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -