Sunday, June 15, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

ట్రూ ట్రాన్స్‌లేషన్‌
1వ వెంగళప్ప : హౌమ్‌డెలివరీ అంటే ఏంటి?
2వ వెంగళప్ప : ఆసుపత్రిలో కాకుండా, ఇంట్లోనే పురుడు పోసుకోవడం!
కంప్లైంట్‌…
పోలీసు : ఏం జరిగిందమ్మా… ఎవరి మీద కంప్లైంట్‌ ఇవ్వడానికి వచ్చారు?
రాధ : మా పక్కింటావిడ మీద. మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గును ఫొటో తీసి, తన ఇంటి ముందు తానే వేసుకున్నట్టుగా ఫేసుబుక్కులో పోస్టు చేసింది. కాపీరైట్‌ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వచ్చా.
అలా చేయండి చాలు!
జడ్జి : రేపు ఉదయం నీకు ఉరిశిక్ష వేయబోతున్నాం. నీ చివరి కోరిక ఏంటో చెప్పు!
ఖైదీ : నాకు మెడ దగ్గర నరం పట్టేసింది. తలకిందులుగా ఉరి తీయండి సార్‌.
మర్యాద!
భార్య : ఏమండీ… కారు తాళాలివ్వండి.. కిడ్డీ పార్టీకి వెళ్లాలి.
భర్త : పక్కనే కదే! కారెందుకు…
భార్య : 5 లక్షల కారులో వెళితే, మర్యాద పెరుగుతుంది… అందుకని!
భర్త : అవునా… ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో. 50 లక్షల బస్సులో వెళ్లు. మర్యాద ఇంకా ఎక్కువ పెరుగుతుంది.
పుత్ర ధర్మం
రవి : డాడీ… నేను స్కూల్‌ ఫస్ట్‌ వస్తే ఎలా ఫీలవుతారు?
తండ్రి : పిచ్చెక్కి గంతులెయ్యనూ ఉత్సాహంగా అన్నాడు తండ్రి.
రవి : తండ్రికి పిచ్చెక్కించే పని కొడుకు చేయలేడుగా. అందుకనే నేను ఫెయిలయ్యా.
నిద్ర లేపాలిగా మరి!
రాము : టీచర్‌… నిన్న క్లాసులో రాధ నిద్రపోయింది.
టీచర్‌ : ఓరి వెధవ! ఆ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు.
రాము : చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే తిడతారని చెప్పలేదు టీచర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -