Sunday, August 3, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

మాట విన్నది
ఆనందరావు : మొట్టమొదటిసారిగా నా భార్య నేను చెప్పిన మాట వెంటనే విన్నదోరు..!” ఆనందంగా చెప్పాడు
సుందరరావు : ఏం చెప్పావ్‌..?
ఆనందరావు : మొన్న మా ఇల్లు నిప్పంటుకుంటే… ఇంట్లోంచి బయటికి వచ్చేయమన్నాను, అంతే.. చెప్పీ చెప్పగానే వచ్చేసింది..!


ఉద్యోగం ఎవరికి?
విష్ణు :ఎందుకురా దిగులుగా ఉన్నావ్‌?
కృష్ణ : మా నాన్నగారు ఉద్యోగం కోసం బాగా వెతుకుతున్నారు
విష్ణు: రిటైర్‌ అయ్యాక కూడా ఖాళీగా ఉండకూడదన్న ఆయన మనస్తత్వం మెచ్చుకోవాలి గానీ దిగులెందుకు?
విష్ణు : ఉద్యోగం వెతకడం ఆయన కోసం కాదురా..! నా కోసం.


కవిత కాదు కపిత
టీచర్‌ : చింటూ చక్కని కవితొకటి చెప్పు.
చింటూ : అమ్మ కొడితే తెల్లబల్లి… నాన్న కొడితే నల్లబల్లి… నేను కొడితే బాహుబలి
టీచర్‌ : నేను కొడితే నీ నడుము బలి.. కూర్చోవోరు బడుద్ధారు.


జ్యోతిష్యం ప్రకారమే
జ్యోతిష్యుడు : డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి?
సుబ్బారావు : ఈ సంవత్సరంలో నేను పిల్లికి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు..!


సంగీతం కాదు
గిరి : ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?
హరి : అబ్బా… అంత బాగా రాగం తీస్తాడా… ఏం రాగం మోహనమా, కళ్యాణీనా…!
గిరి : కూనిరాగం బాగా తీస్తాడు.


పరామర్శ ఎందుకంటే
శివ : ఏమిట్రా నిమిష-నిమిషానికీ వచ్చి బాగున్నావా అని అడుగుతున్నావు?
రాము : మన దేశంలో సగటున నిమిషానికొకడు పోతున్నాడట! అందుకే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -