Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

కోపం వస్తే అంతే…

సుందర్‌ : నా మీద కోపం వస్తే ఆ కోపాన్ని మా ఆవిడ బట్టలుతకడంలో చూపిస్తుంది..!
రాజు : అదెలా?
సుందర్‌ : కోపం లేకపోతే నేను బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే బట్టలు విప్పకముందే ఉతుకుతుంది..!

ఉంటేకదా పోడానికి!

డాక్టర్‌ : మీ ఆయనకి జ్ఞాపకశక్తి పోయిందమ్మా. ఇక మీదట ఏమీ గుర్తుండదు.
పేషెంట్‌ భార్య : మీరు భలే జోక్‌ చేస్తున్నారు డాక్టర్‌. మా ఆయనకి ఇంతకుముందు కూడా ఏదీ జ్ఞాపకం ఉండదు. ఏది తెమ్మన్నా మర్చిపోయి వస్తుంటారు.

అదీ సంగతి!
కూరల షాపు వాడు : ఎప్పుడూ మంచివి కొనేవారు, ఇప్పుడేంటమ్మా… సచ్చులు, పుచ్చులు కొంటున్నారు?
ఇల్లాలు : ఇంటికి వచ్చిన చుట్టాలు నెల్లాళ్ళయినా ఇంకా వెళ్ళటం లేదయ్యా. మరేం చేయమంటావ్‌.

అంతా ఐపోయాక
భర్త : నేను నీ పతిదేవుణ్ణి కావడం నీ అదృష్టమే కాంతం.
భార్య : వసుదేవుడు లాంటి మా నాన్న నన్ను మీ కిచ్చి చేయడం ఎంత అదృష్టమో మీరు రోజూ బారుకెళ్తుంటే గానీ తెలీలేదు.

ఎంత ఆశ!
సుబ్బారావు : మీ ఆవిడ ఊరెళ్ళిందన్నావుగా… ఈ రోజు నైట్‌ మీ ఇంట్లో మందు పార్టీ చేసుకుందాం పద.
అప్పారావు : నేనూ అలాగే అనుకున్నా… కానీ మా ఆవిడ మా ఇద్దరి సంగతి తెలిసి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళింది. ఇప్పుడు నేనే ఎక్కడ తల దాచుకోవాలా అని ఆలోచిస్తున్నాను.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad