Sunday, September 28, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

అర్థం కాని భాష
ఒక అందమైన అమ్మాయి ఒక మెడికల్‌ షాప్‌ బయట నుంచుని ఉంది. తనకి కావాల్సింది అడుగుదామంటే, షాపులో జనం చాలా మంది ఉన్నారు. అసలు అది అడగాలంటనే చాలా సిగ్గుగా ఉంది తనకి. ఆఖరుకి షాపులో ఒక్కరూ లేరనుకుని… వెళ్ళి అడుగుదామని, మళ్ళీ సిగ్గుపడుతూ ఆగిపోయింది…
ఇందాకటి నుండి ఈ అమ్మాయిని చూస్తున్న షాపతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి.. ”ఏం కావాలమ్మా నీకు.. అంత సిగ్గుపడితే ఎలా?” అన్నాడు.
ఆ అమ్మాయి ”ఏం లేదండీ, నాకు కాబోయే భర్త డాక్టర్‌. ఆయన మొదటిసారి లవ్‌లెటర్‌ రాశాడు. అది నాకు అర్ధం కావడం లేదు. కాస్త చదివి పెడతారా?” అంది.

భలే కారణం
అబ్బాయ్ : బాబాయ్ చైనా క్రికెట్‌ ఎందుకు అడదు?
బాబాయ్ : కొన్ని టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ రా అబ్బాయ్
అబ్బాయ్ : ఏమిటవి?
బాబాయ్ : అందరి ముఖాలు ఒకేలాగా ఉంటాయిగా. ఎవరైనా ఔట్‌ అయ్యి పెవిలియన్‌కి వెళ్తే మళ్లీ ఎవడొస్తాడో బ్యాటింగ్‌ చేయడానికి గుర్తుపట్టలేం. ఒక్కోసారి ఔట్‌ అయిన వాడు కూడా మళ్ళీ బ్యాటింగ్‌ చేయడానికి రావొచ్చు. అందుకని ఐసిసి చైనాని బ్యాన్‌ చేసింది.

సరదా సరదా
భార్య : ఏమండీ మనం సోమవారం షాపింగ్‌కి, మంగళవారం హోటల్‌కి, బుధవారం ఔటింగ్‌కి, శుక్రవారం సినిమాకు, శనివారం పిక్నిక్‌ వెళ్తే ఎలా ఉంటుంది. సూపర్‌ కదా!
భర్త : ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి
భార్య : ఎందుకు?
భర్త : అడుక్కోటానికి..

పాకెట్‌ మనీ
భార్య : ఏవండీ… మన అమ్మాయి ప్రేమలో పడిందేమోనని అనుమానంగా ఉంది.
భర్త : ఎందుకొచ్చింది ఆ అనుమానం?
భార్య : ఈ మధ్య పాకెట్‌ మనీ అడగట్లేదు… అందుకే!

రెండే మాటలు
చైతన్య : మనం ఆడాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాం కదా… అది తప్పు.. నిన్న ఒక చీరల షాపుకెళ్ళా.. పాపం వాళ్ళు ‘రెండే’ మాటలు మాట్లాడుతున్నారు..
సుధీర్‌ : అరే.. ఆడాళ్ళు తక్కువ మాట్లాడటమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు?
చైతన్య : ఒకటి… ఈ డిజైన్‌లో వేరే కలర్‌ చూపించు! రెండోది…. ఈ కలర్లో వేరే డిజైన్‌ చూపించు.

బాల్య వివాహం
రాజు : పక్కింటి దంపతులు ఎప్పుడూ చిన్నపిల్లల్లా పోట్లాడుకుంటారెందుకు..?
సుందర్‌ : వాళ్ళది బాల్య వివాహం లెండి..!

అప్పుడే కష్టాలా?
కిరణ్‌ : నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్‌..!
సుజాత : ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!

నీరసం
వికాస్‌ : మీ ఆఫీసులో లంచాలు లేవా సార్‌
కార్తీక్‌ : అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?
వికాస్‌ : ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.

మీసమున్న మగవాడు..
సుధీర్‌ : ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?
వెంకట్‌ : అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -