- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని ఆల్ ఇండియా యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించే భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజన ఆలయ్ బలయ్ కార్యక్రమ కరపత్రాలను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించి కరపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు, గౌరవ అధ్యక్షులు చంద్రం, ఏఐఏవైఎస్ మాచారెడ్డి మండల అధ్యక్షులు లక్ష్మీరాజం, బిబిపేట్ మండల ఉపాధ్యక్షులు రాజు, ఈ పట్టణ జనరల్ సెక్రెటరీ రవితేజ, సదాశివ నగర్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -