Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబికా దర్బార్‌ బత్తి కొత్త ప్రొడక్ట్‌ ''రాగస్వర సుప్రభాతం'' ఆవిష్కరణ

అంబికా దర్బార్‌ బత్తి కొత్త ప్రొడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” ఆవిష్కరణ

- Advertisement -

చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా..
హైదరాబాద్‌ :
భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అనే ఖ్యాతి పొందిన ప్రముఖ దర్బార్‌ బత్తి బ్రాండ్‌ అంబికా సంస్థ కొత్త ప్రొడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” ను మంగళవారం ముచ్చింతల్‌ లోని ‘శ్రీరామనగరం’ (సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం శ్రీరామానుజుల వారి సన్నిధిలో, 108 దివ్యదేశాల సముఖంలో త్రిదండి చినజీయర్‌ స్వామి వారి దివ్య హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబికా సంస్థల అధినేత అంబికా కష్ణ, అంబికా సంస్థల కారనిర్వాహణ డైరెక్టర్స్‌ అంబికా రామచంద్ర రావు, అంబికా ఆరోగ్య డైరెక్టర్‌ కార్తీక్‌ ఆలపాటి పాల్గొన్నారు. రాగస్వర సుప్రభాతం దర్బార్‌ బత్తి ప్రాడక్ట్‌ ఆవిష్కరణ అనంతరం చినజీయర్‌ స్వామి తమ ఆశీస్సులు అందజేశారు. అనంతరం త్రిదండి చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ ”శ్రేష్టమైన దర్బార్‌ బత్తీల తయారీతో కోట్లాది భక్తులకు దగ్గరైంది అంబికా సంస్థన్నారు. అంబికా దర్బార్‌ బత్తి వారు ఉపయోగించే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అనే మాట విస్తతంగా ప్రచారం పొందింది. ఆ మాటకు తగినట్లుగానే దైవం పట్ల విశ్వాసాన్ని మరింతగా పెంచుతూ గొప్ప బ్రాండ్‌ గా అంబికా సంస్థ ఎదిగింది. దేవుడికి సమర్పించే ధూపం ఘాటుగా ఉక్కిరి బిక్కిరి చేసేవిదంగా వుండకూడదు. ముక్కుకు పరిమళం, కంటికి ఇంపుగా వుండాలి. అలాంటి పరిమళ ధూపం 125 ఏండ్లుగా అందిస్తూ, ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పతులను అందిస్తోంది” అన్నారు. ”అంబికా సంస్థకు చెందిన మరో కొత్త దర్బార్‌ బత్తీ ప్రొడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” ను శ్రీరామానుజుల వారి సన్నిధిలో, 108 దివ్యదేశాల సముఖంలో ప్రారంభించుకున్నాం. పూజ గదిలో అగరువత్తుల పేటిక తెరిచినా వెంటనే స్వామి వారి సుప్రభాతం స్వరమ్‌ వినిపించడంతో కొత్త అనుభూతిని పొందుతారు. ”రాగస్వర సుప్రభాతం” ప్రొడక్ట్‌ కూడా భక్తుల ఆదరణ పొందాలని, అంబికా కష్ణ ఆరోగ్యం బాగుండాలని మంగళశాశనాలు అందిస్తున్నాను” అన్నారు.

అంబికా సంస్థల అధినేత అంబికా కష్ణ మాట్లాడుతూ ”ఈ రోజు సమాజంలో ఎన్నో విద్వేషాలతో అసమానతలు, అల్లర్లు జరుగుతున్నాయి. అలాంటి నేటి పరిస్థితుల్లో సమసమాజ స్థాపనకు త్రిదండి చినజీయర్‌ స్వామి వారు చేస్తున్న కషి చాలా గొప్పది. ఆయన సాక్షాత్తూ నడిచే రామానుజాచార్యులుగా భావిస్తాను. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 108 దివ్య దేశాల సమక్షంలో మా అంబికా దర్బార్‌ బత్తి వారి కొత్త ప్రొడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” ఆవిష్కరించుకోవడం నా పూర్వ జన్మ సుకతంగా, అదష్టంగా భావిస్తున్నా. మా అంబికా సంస్థపై కోట్లాది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచుతూ ముందుకు సాగేలా మా కొత్త ప్రాడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” ఉంటుందని తెలియజేస్తున్నా. మనం ఎక్కడెక్కడికో వెళ్లకుండా 108 ఆలయాలను ప్రతిష్టించిన ఘనత త్రిదండి చినజీయర్‌ స్వామి వారిది. ఆయన లేకపోతే ఇంత దివ్యక్షేత్రం మనకు వచ్చేది కాదు.మరో రామానుజాచార్యుల ఆయన ఆశీర్వచనం అందరికీ అందాలని, తద్వారా మన దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా. మన మతానికి గొప్ప పేరును, ప్రాతినిధ్యాన్ని తీసుకొచ్చిన రామానుజాచార్యుల వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్న”. అన్నారు.
అంబికా రామచంద్రరావు గారు మాట్లాడుతూ ”సుప్రభాతం అనేది కేవలం ఒక పాట కాదు అది భగవంతుడిని మేల్కొల్పే మధుర పిలుపు, అది మనలోని దైవత్వాన్ని కూడా మేల్కొల్పుతుంది. అన్నారు.అంబికా దర్బార్‌ బత్తి కొత్త ప్రాడక్ట్‌ ”రాగస్వర సుప్రభాతం” కేవలం వెలిగే అగర్బత్తి మాత్రమే కాదు, మీ ఇంట్లో ఒక దివ్యమైన ఉదయకాల సంగీత కచేరీని ఆవిష్కరిస్తుంది. కోట్లాది మంది హదయాలను ఉప్పొంగించే అమర కావ్యం ‘శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం’ ఇప్పుడు ఈ విలాస వంతమైన అగర్బత్తి బాక్స్‌లో ప్రాణం పోసుకుంది” అన్నారు. ఈ అద్భుతమైన బాక్స్‌ను తెరిచిన వెంటనే, సుప్రభాత శ్లోకాల మధుర స్వరం దానంతట అదే వినిపిస్తుందన్నారు. మీరు అగర్బత్తి వెలిగించక ముందే ఆ దివ్య ధ్వని మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుందని, దీనిలోని ప్రత్యేక మ్యూజికల్‌ మెకానిజం మీరు బాక్స్‌ తెరిచిన ప్రతిసారీ 5 నిమిషాల పూర్తి సుప్రభాతాన్ని వినిపిస్తుందన్నారు. ”అగర్బత్తులు పూర్తయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో ఒక మ్యూజిక్‌ ప్లేయర్‌గా భద్రపరు చుకోవచ్చు. త్వరలోనే వారంలోని ఏడు రోజులకు, ఏడుగురు దేవతలకు సంబంధించిన ఏడు విభిన్న సువాసనలతో కూడిన ప్యాక్‌లను కూడా విడుదల చేయనున్నమని” చెప్పారు. అంబికా ఆరోగ్య డైరెక్టర్‌ కార్తీక్‌ ఆలపాటి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఈ దివ్య అనుభూతిని కేవలం సువాసన ద్వారానే కాకుండా, పవిత్ర శబ్ద మరియు స్పర్శ ద్వారా కూడా అనుభవించాలని మేము ఈ ఉత్పత్తిని రూపొందిం చాము అన్నారు. ఉదయాన్నే దైవారాధనతో రోజును ప్రారంభించే కోట్లాది మంది భక్తులకు మా ఈ చిరు కానుక అన్నారు. ఈ ఉత్పత్తులు త్వరలో అన్ని ప్రముఖ పూజా స్టోర్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉత్పత్తులు క్లాస్‌ 1, క్లాస్‌ 3 కింద పేటెంట్‌ మరియు ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ పొందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -