నవతెలంగాణ – వనపర్తి
సుప్రీంకోర్టు చీఫ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పైన, న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు కాలును విసరటం జరిగిందని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుంది అని మత పిచ్చోడు న్యాయవాది రాకేష్ కిషోర్ నినాదాలు ఇవ్వడం, నాకు దేవుడు చేయమన్నాడు బూ టు విసమన్నాడు విసిరాను ఇప్పుడు కూడా విసురుతా అనడం ఎంత తీవ్రవాద చర్య నో అర్థమవుతుందన్నారు.
ఆయన భావజాలం స్పష్టంగా అర్థం అవుతుందని నేడు ఆర్ఎస్ఎస్ సంగు పరివార్ శక్తులు ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయన్నారు. ఈ భావజాలం ఎటు నుంచి వచ్చిందో అర్థం అవుతుందని విమర్శించారు. దీన్ని ఖండిస్తూ రాకేష్ కిషోర్ పై చట్ట ప్రకారం అరెస్టు చేసి కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి మాత్రమే కాదు జస్టిస్ పై దాడి చేసిన లాయర్ రాకేష్ కిషోర్ సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రకటించడం ప్రజాస్వామ్య లౌకిక విలువలు కలిగిన రాజ్యాంగంపై దాడిగా చూడాలని అన్నారు . ప్రజాస్వామిక వాదులు దేశవ్యాప్తంగా ఈ దాడిని ఖండించిన కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కానీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం ఆందోళన కలిగించే అంశం అన్నారు.
మనువాద సిద్ధాంతం కలిగిన బిజెపి రాజ్యాంగాన్ని గుర్తించడానికి సిద్ధపడటం లేదు.అనేదానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించిన న్యాయ సూత్రాలను అమలు అమలు జరిపే వారిపై దాడులు చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని, లౌకిక భావాలను, పౌరుల హక్కులను , దేశ సార్వభౌమత్వాన్ని కించపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి మాట్లాడుతూ.. రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్. గవాయి పై బూటు వీసా రాడ మే కాకుండా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పద్ధతుల్లో దాడులు చేస్తామని హెచ్చరించటం అంటే ఈ దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారతర రాజ్యాంగం పై చేస్తున్న దాడి కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు ఆయన అన్నారు.
దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించినప్పుడే భారత రాజ్యాంగం పైన సరైన నమ్మకం ప్రజలకు కలుగుతుందని ఆయన అన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడినప్పటికీ న్యాయశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఈ ఘటనపై మాట్లాడకపోవడం వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు డి. కురుమయ్య, గంధం మదన్, జి బాలస్వామి ఏ. రమేష్, సీపీఐ(ఎం) నాయకులు ఎం. మన్యం, జి. రాబర్ట్, రత్నయ్య, సాయి లీల, ఈ. పురుషోత్తం, సి. పుల్లయ్య భాస్కర్, బి. కురుమయ్య మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి :సీపీఐ(ఎం) డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES