Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోర్టు ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష

కోర్టు ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష

- Advertisement -

ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి:  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ 
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని కోర్టు ఆవరణం లో న్యాయవాదుల రక్షణ చట్టం సాధన కోసం అచ్చంపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడారు. రాష్ట్రంలోని  పలు జిల్లాలలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు  భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆ రెండ్లుగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఇలాంటి సంఘటనల జరుగుతున్న నేపథ్యంలో వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సీనియర్ న్యాయవాది రాజేందర్ రిలే దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్షలో కూర్చున్న న్యాయవాదులకు పూల  దండలు వేశారు. ఈ  సందర్భంగా మాట్లాడారు దేశవ్యాప్తంగా రోజువారిగా ఏదో ఒకచోట న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఇది సరైన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ పాలనకు ముప్పు అన్నారు. ఇలాంటి దారుణ సంఘటనలు న్యాయవృత్తి గౌరవాన్ని, న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలత  వేసిందన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాలు లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రవీందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకట్ శెట్టి, సత్తయ్య, వెంకటేశ్వరరావు, రవికుమార్,శ్రీధర్ రావు, మల్లేష్, జూనియర్ న్యాయవాదులు చందు, చత్రు,  సరిత ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -