- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
కార్మిక శాఖ లో నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి పల్నాటి యోహాన్ ను గురువారం రోజు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో కప్పి న్యాయవాదులుఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడం జరిగిందని భవిష్యత్తులో ప ప్రజా సేవలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ చీఫ్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్, న్యాయవాదులు మామిడి విక్రం రెడ్డి, శామ్, రతన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -