Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ.. 

నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ.. 

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ చేశారు. పంబాల పూజారి రౌతు కిషోర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఎస్సీ కాలనీ సమీపంలో పాత  స్థలాన్ని మరోసారి గుర్తించి, పసుపు కుంకుమ సమర్పించి  కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి ఇదే గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలు దాతలుగా ముందుకు రావడం జరిగింద న్నారు. ఇందులో భాగంగా నేడు స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 గంటలకు  ఆలయ నిర్మాణానికి ముగ్గు పోయడం జరుగుతుందని కావున గ్రామ మహిళలు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అధిక సంఖ్యలో హాజరై పూజలో పాల్గొని విజయవంత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెరుమాండ్ల రాజేశ్వర్, గట్టు మహేందర్, బిరుదు రాములు, వడ్లకొండ నాగరాజు, ఎర్రం సతీష్ కుమార్, పెరుమాండ్ల నవీన్,కన్నూరి కుమార స్వామి,కత్తి తిరుపతి, ముక్కెర రాజు, పైతరి సదయ్య,  గాజుల వెంకటస్వామి, సుంకరి ప్రమోద్, గట్టు రమేష్, తోడేటి విజేందర్, కసుబోజుల రమేష్,పబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad