సర్టిఫికెట్ అందుకున్న ముఖ్యమంత్రి
హార్వర్డ్ యూనివర్సిటీలో ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో కోర్సు పూర్తిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి
లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో సీఎం రేవంత్‌రెడ్డి లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు జరిగాయి. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి ఈ తరగతులకు హాజరైనట్టు.. టీచర్స్, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి.



