రాష్ట్రంలో పరిస్థితిపై మాజీ సీఎం ఆరా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో అధినేత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు,
ప్రజా సమస్యలు, తదితర అంశాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఈ సందర్భంగా కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం :కేటీఆర్
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు చేశారు. ” కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకట్రెండు రోజులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు.a
కేసీఆర్‌కు నాయకుల పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES