Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పరిశీలించిన నాయకులు

శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పరిశీలించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి మండలం గుంటూరు గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని శితిలావస్థలో వున్నా పాత భవనాలను పంచాయతీ రాజ్ శాఖ డీఈ బస్వలింగం, ఏఈ షబ్బీర్ కలిసి పరిశీలించారు. పాఠశాల ఆవరణలో శితిలావస్థలో వున్నా భవనాలను త్వరలోనే తొలగించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తాం అని వారు తెలిపారు. గత నెలలో గుండూర్ గ్రామంలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన సందర్బంగా గ్రామస్తులు పాత భవనాలు తొలగించాలని, వారి ద్రుష్టికి తీసుకెళ్లడంతో స్పందించి అధికారులను పంపించినందుకు గ్రామస్థులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సురభి వెంకటేశ్వర రావుకు ధన్యవాదములు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నంబి శంకర్, పోతుగంటి రాజు, కార్యకర్తలు జంగిటి శేఖర్, పోతుగంటి అశోక్, మంగ నాగేష్, గ్రామస్తులు ఉపాధ్యాయులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -