- Advertisement -
నవతెలంగాణ – నవీపేట్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ను నవీపేట్ బిఆర్ఎస్ నాయకులు హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి పూల బోకెను అందించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తడిసిన, మొలకెత్తిన ధాన్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అలాగే మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, మాజీ సర్పంచ్ అల్లం రమేష్, తాహెర్ బిన్ జాఫర్, యూసుఫ్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    