- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, పాలకుర్తి నియోజకవర్గ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రొగ్రాం ఇంచార్జి బొర్రా జ్ఞానేశ్వర్ ను ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ముత్యాల పూర్ణచందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన నియోజకవర్గ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రొగ్రాం ఇంచార్జి భాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -