- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణ మున్సిపల్ ఎన్నికల సరళి గురించి చర్చించి స్థితిగతుల గురించి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ శ్రీనివాస్, దాసరి సునీల్, శ్రీమాన్, అంబల తిరుపతి, గంగ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



