నవతెలంగాణ – జుక్కల్
హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క నివాసంలో జుక్కల్ నియోజకవర్గ లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు శుక్రవారం కలవడం జరిగింది. లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ ( LHPS) ఆధ్వర్యంలో చలో జుక్కల్ కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం గోర్ ధర్మ సమాజ్ పరిరక్షణకై అందరు కట్టుబాటు ఉండాలని , అదేవిధంగా భారత రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్లో గోర్ బోలి భాషను చేర్చాలని మంత్రి సీతక్కను కోరారు. జుక్కల్లో సభ నిర్వహిస్తున్నామని, ముఖ్యఅతిథిగా రావాలని రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ కూడా ఆహ్వానం పత్రిక ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) మొహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ సేట్కేర్, స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, బాబు సింగ్ ఎమ్మెల్సీ (ఆల్ ఇండియా బంజారా శక్తి పీట్ పోరా దేవి పీఠాధిపతి ), మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, పోరా దేవి పీఠాధిపతి ప్రధాన కార్యదర్శి బద్య నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు సింగ్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ తదితరులు పాల్గొంటారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ జాదవ్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ జాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బద్రి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి జాదవ్, ఎల్లారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ బానోత్ మదన్లాల్, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ నాయక్, బాన్సువాడ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ రాథోడ్ , రాజారాం , రాజేష్ , జగన్ తదితరులు పాల్గొన్నారు.