Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బల్ల సుశీల చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు

బల్ల సుశీల చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేర్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బడి పంతులు బల్ల వెంకటేష్ మాతృమూర్తి అయిన బల్ల సుశీల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్ పాల్గొని,ఆమె సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.బల్ల సుశీల సేవలు, కుటుంబానికి ఆమె చేసిన త్యాగాలు స్మరణీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,పాపకారి మాధవ రెడ్డి,ధర్మ గోవర్ధన్ రెడ్డి,యాట యాదేశ్,రమేష్,గంజి హనుమంతు, ఎలగందుల బాబు తదితరులు పాల్గొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -