నవతెలంగాణ – ఆర్మూర్
ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ స్కూలుకు వెళ్తున్నారా అని అమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ శనివారం ప్రశ్నించారు. విద్యార్థులకు ఎలా చదువుతున్నారు ఎప్పుడైనా విద్యార్థులతోని మాట్లాడారా..? వాళ్ళ స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అడిగినారా? వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఎలా పెడుతున్నారు అడిగినారా.? వాళ్ళ స్కూల్లో మంచినీళ్లు అందుబాటులో ఉందా లేదా అని అడిగారా? ఆడపిల్లలకు వెళ్లే దానికి వాష్ రూమ్ లో సరిగా ఉన్నాయా లేదా అని అడిగారా.? ఇవన్నీ ఒక నాయకుడు బాధ్యత ప్రతి ఒక స్కూల్లో వెళ్లి ఆ స్కూల్లో ఉన్న సమస్యలను చూసి విద్యార్థులతోని మాట్లాడి వాళ్ళ స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని పైన ఉన్న అధికారులకు ఆ సమస్యల మీద మాట్లాడారా అని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఎటు వెళ్తున్నారు.. ఇది మీ బాధ్యత కాదా ప్రతి ఒక్క నాయకుడికి బాధ్యత అన్ని ప్రభుత్వ స్కూల్లో వాళ్ళ స్కూళ్లలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి ఒక నాయకుడిది అని గుర్తు చేశారు.
నాయకులు ప్రభుత్వ బడుల్లోని సమస్యలపై కూడా దృష్టి పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES