- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృ మూర్తి శ్రీమతి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ పరమపదించగా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ నేపథ్యంలో వారు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి మాతృమూర్తి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ టిపిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిట్ , మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, నాయకులు సాయినాథ్ గౌడ్ , నటరాజు , భూపేందర్ , మహమ్మద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -