Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల కోసమే జీవించే నాయకత్వం అరుదు

ప్రజల కోసమే జీవించే నాయకత్వం అరుదు

- Advertisement -

– మద్ది కాయల ఓంకార్‌ జీవితం ఆదర్శం : రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌
– ఎంసీపీిఐ(యూ) ఆధ్వర్యంలో ఓంకార్‌ శతజయంతి
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ప్రజల కోసం తమ జీవితాలను అర్పించే నాయకత్వం అరుదు.. నేటి తరానికి మద్ది కాయల ఓంకార్‌ జీవితం ఆదర్శం అని రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఓంకార్‌ భవన్‌లో మంగళవారం ఎంసీపీఐ(యూ) జనరల్‌ బాడీ సమావేశం వస్కుల సైదక్క అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా, ఎమ్మెల్యేగా, కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతవాదిగా ఓంకార్‌ అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. ఆదివాసీలకు స్వయం పాలన అధికారం కావాలని, భద్రాచలం రాజధానిగా గోదావరి లోయ పరివాహక అటవీ ప్రాంతం ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు పాలనాధికారం కల్పించాలని, 1986-1987లో నెలల తరబడి పోరాటాలు చేసి ఆదివాసీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు చారిత్రాత్మకం అన్నారు. కేంద్రంతోపాటు 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, దాని మద్దతుదారులు అధికారం అనుభవిస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఐక్యతతో అధికారంలోకి రావడమే ఓంకార్‌కు నిజమైన నివాళి అన్నారు. ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్‌ ఓంకార్‌ మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా.. ప్రపంచ శాంతి కోసం ప్రజాఉద్యమాల నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ.. ఓంకార్‌ శతజయంతి సభలు 2025 మే 12 నుంచి ప్రారం భమై 2026 మే 12 వరకు జరుగుతాయన్నారు. అనంతరం ఇటీవల మరణిం చిన ప్రపంచ ఖ్యాతిగాంచిన గుగువా థియాంగోకు, మహిళా నేత శాఖమూరి సుగుణమ్మకు, కేరళ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.యన్‌ నారాయణన్‌, కుక్కల యాకయ్యకు, విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించారు.
ఓంకార్‌ శతజయంతి వార్షికోత్సవ నిర్వహణ కమిటీ
గౌరవాధ్యక్షులుగా రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌, అధ్యక్షులుగా ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, కోశాధికారిగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా గాదగోని రవి, వస్కుల మట్టయ్య, కుంభం సుకన్య, హెన్‌రెడ్డి హంసారెడ్డి, సహాయ కార్యదర్శులుగా వరికుప్పల వెంకన్న, పెద్దారపు రమేష్‌, మంద రవి, యస్‌కె.నజీర్‌, వి.తుకారాం నాయక్‌, మరికొంత మంది సభ్యులను నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -