మంత్రి శ్రీధర్‌బాబుకు మంద కృష్ణమాదిగ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న లిడ్ క్యాప్‌కు సంబంధించిన భూములను ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిడ్ క్యాప్ భూములను ,ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనీ , లిడ్ క్యాప్, లేదర్ వర్క్ మీద సమగ్రమైన అవగాహన కలిగిన అధికారిని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించాలని కోరారు.
లిడ్ క్యాప్ భూములను పెట్రోల్ బంక్, యూనిట్ మాల్ కేటాయిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తన పరిధిలో ఉన్న డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేస్తానని తెలిపారు. పెట్రోల్ బంక్ లీజును రద్దు చేస్తామనీ, మిగితా డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ చర్మకారుల జేఏసీ చైర్మెన్ అరేపల్లి రాజేందర్, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ , ఎంఎస్‌పీ జాతీయ నేత మంథని సామేల్, చర్మకారుల జేఏసీ కన్వీనర్ ములుగు రాజు మాదిగ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
లిడ్ క్యాప్ భూముల లీజు రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES