– జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
నందిపాడులో సీపీఐ(ఎం) విజయం సాధించడానికి సీపీఐ ఎంఎల్ మాస్లైన్,కాంగ్రెస్ చేయూత సోపానం అని పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య అన్నారు. నూతన పాలక వర్గం ఏర్పాటు కానున్న క్రమంలో సోమవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యులకు అభినందన,ఓటర్లు కు కృతజ్ఞతలు తెలిపేందుకు నందిపాడు లో మడకం రాజబాబు అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అవగాహన,ఎన్నికల ఒడంబడిక లో భాగంగా వామపక్షాలతో కలిసి పనిచేయాలనే విధానం ప్రకారం ఈ స్థానిక ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్,టీఆర్ఎస్,అక్కడక్కడ కాంగ్రెస్ తో తాత్కాలిక ఎన్నికల ఒప్పందం సత్ఫలితాలు ఇచ్చాయని హర్షం వ్యక్తం చేసారు.ముందుగా నందిపాడు మాజీ సర్పంచ్,అమరజీవి ఊకే వీరాస్వామి చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఆయన ఆశయాలు ను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిరంజీవి, కారం వీరాస్వామి,మడకం పెద్ద ప్రసాద్,కారం సూరిబాబు,సర్పంచ్ కూరం దుర్గమ్మ,ఉప సర్పంచ్ చుట్టి వీరభద్రం వార్డు సభ్యులు పాల్గొన్నారు.



