Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుStrike on July 9: జులై 9 న దేశ వ్యాప్త సమ్మె వామ పక్షాల...

Strike on July 9: జులై 9 న దేశ వ్యాప్త సమ్మె వామ పక్షాల మద్ధతు

- Advertisement -

– రైతాంగ, వ్యవసాయ, కార్మిక సంఘాల డిమాండ్ సాధనకై ఈ దేశ వ్యాప్త సమ్మె

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) రాష్ట్రకార్యలయంలో సోమవారం వామపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లతో కార్మిక సంఘాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. కార్మికులకు సరైన కనీస వేతనం అమలు కావడం లేదు. కార్మికుల హక్కులకు కేంద్ర వైఖరికి వ్యతిరేక చర్యల్లో జులై 9 నిరసన చేపడతామని తెలిపారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు బదులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో సరిపెడుతుంది. మావోయిస్టుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదం పై చర్చలు చేసిన కేంద్రం మావోయిస్టులను మాత్రం చంపేస్తోంది. ఆకలి సూచికలో దేశం 102 వ స్థానంలో ఉంది. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు జులై 9 న జరిగే దేశ సమ్మెలో పాల్గొంటాయి. ప్రజా సమస్యల పరిష్కారానికై జులై 9 న ఉద్యమిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -