శాంటియాగో : చిలీ అద్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటి చేసిన జెన్నెట్ జారా 26.85% ఓట్లు సాధించారు. మితవాద పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ నుండి పోటీ చేసిన జోస్ ఆంటోనియోకి దాదాపు 23.92% ఓట్లు వచ్చాయి. ఫ్రాంకో పారిసి (పార్టీ ఆఫ్ పీపుల్) 19.71% ఓట్లతో మూడవ స్థానాన్ని పరిమితమయ్యారు. మరో అభ్యర్థి జోహన్నెస్ కైసర్ ఓటమిని అంగీకరించారు. ఏ అభ్యర్థీకీ 50% ఓట్లు రాకపోవడంతో రెండో విడత ఎన్నిక అనివార్య మయింది. ఈ ఎన్నికలు డిసెంబర్ 14న జరగనున్నాయి. దీనిలో జారా, జోస్ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీపడనున్నారు.. మిగతా అభ్యర్థులకంటే అధిక ఓట్లు సాధించిన లెఫ్ట్ నాయకురాలు జెన్నెట్ జారా దేశంలో వ్యవస్థీకృత నేరాలను అరికడతానని, బ్యాంక్‌ల పనితీరును మెరుగుపరుస్తానని, జీవన ప్రమాణాలు పెంచుతానని ప్రచారం చేశారు. మరోవైపు మితవాద పార్టీ అభ్యర్థి జోస్ ఆంటోనియో అమెరికాతో చేతులు కలిపి ట్రంప్ విధానాలను ప్రచారం చేశారు. వలసదారులను తరిమేస్తానని, బొలివియా సరిహద్దులో గోడలు, కంచెలు, కందకాలు నిర్మిస్తానని ప్రచారం చేశారు. దీంతో వామపక్షం వర్సెస్ ఫాసిజంగా ఎన్నికలు మారిపోయాయి.
చిలీ అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ అభ్యర్థి ముందంజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



