Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరిత్య చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరిత్య చర్యలు

- Advertisement -

రాయపోల్ ఎస్ఐ కుంచం మానస
నవతెలంగాణ – రాయపోల్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా విధిచడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మానస సిబ్బందితో కలిసి రాయపోల్–గజ్వేల్ రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది.పట్టుబడిన వ్యక్తిని గజ్వేల్‌లోని కోర్టు మెజిస్ట్రేట్ మణివీర్ ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనకు మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా ఎస్సై మానస మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అది వాహనదారులతో పాటు ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ విచారణ అనంతరం జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -