నవతెలంగాణ – మద్నూర్
15 ,10 , 2025న బుధవారం ఉదయం 11:30 కి మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా రెసిడెన్షియల్ స్కూల్లో, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అలాగే మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ నందు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని న్యాయ సేవ సంస్థ వాలంటీర్లు ఉడుతవార్ సురేష్, మోరే అశోక్ కుమార్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి. టి. నాగరాణి, బిచ్కుంద కోర్టు జడ్జి వినీల్ కుమార్ విచ్చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. న్యాయ చైతన్య అవగాహన సదస్సు కు పత్రిక మీడియా విలేకరులందరూ హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు.