Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంసర్‌పై న్యాయపోరాటం

సర్‌పై న్యాయపోరాటం

- Advertisement -

– కేరళ అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం
తిరువనంతపురం :
కేరళలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఓటర్ల జాబితా(సర్‌)కు వ్యతిరేకంగా లెఫ్ట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నందున దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకుంటామని ఆన్‌లైన్‌ సమావేశానికి అధ్యక్షత వహించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఈ నిర్ణయానికి తమ మద్దతును ప్రకటించాయి. గత లోక్‌సభ ఎన్నికల నుంచి నవీకరించబడిన జాబితా ఇప్పటికే అమలులో ఉన్నప్పుడు, 2002 రోల్స్‌ ఆధారంగా ఓటరు జాబితాను స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) చేయడం ”అశాస్త్రీయం” , ”దుర్మార్గపు ఉద్దేశం” కలిగి ఉందని సీఎం అన్నారు. ప్రతిపక్ష నాయకుడు వీ.డీ. సతీశన్‌ ముఖ్యమంత్రి వైఖరితో ఏకీభవించారు. సర్‌ కేసులో తామూ జోక్యం చేసుకుంటామని ప్రకటించారు. సర్‌ ప్రక్రియ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ అన్నారు. 2002 జాబితాను బేస్‌గా ఉప యోగించడంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తావించిన అఖిలపక్ష నేతలు సర్‌ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రస్తావించారు.కేరళ శాసనసభ ఇప్పటికే సర్‌కి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాన ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మినహా ఇతర పార్టీలు కూడా అదే విధానాన్ని అనుసరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -