Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచట్టపరమైన సౌకర్యాలు కల్పించాలి

చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలి

- Advertisement -

హెచ్‌బీఎల్‌ కార్మికులకు న్యాయం చేయాలి : కార్మిక శాఖ కమిషనర్‌కు సీఐటీయూ వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హెచ్‌బీఎల్‌ పరిశ్రమలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు చట్టపరమైన సౌకర్యాలు కల్పించకుండా కంపెనీ యాజమాన్యం అన్యాయం చేస్తున్నదనీ, వారికి తగిన న్యాయం చేయాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శి కూరపాటి రమేష్‌, మేడ్చెల్‌ మల్కాజిగిరి ప్రధాన కార్యదర్శి ఏ అశోక్‌, కార్యదర్శి ఐ రాజశేఖర్‌ కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. మేడ్చెల్‌ జిల్లాలోని అలియాబాద్‌ మున్సిపాల్టీలో ఉన్న హెచ్‌బీఎల్‌ బ్యాటరీ కంపెనీలో సుమారు రెండు వేల మంది కార్మికులు 25ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి చట్టబద్ద సౌకర్యాలు వర్తింపజేయటం లేదని పేర్కొన్నారు. ఓటీ చేస్తే సింగిల్‌ పేమెంట్‌ కట్టిస్తున్నారని పేర్కొన్నారు, బోనస్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారాంతపు సెలవులు ఇవ్వటం లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -