Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్‌, రంగారెడ్డిలకు శాసనమండలి సంతాపం

మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్‌, రంగారెడ్డిలకు శాసనమండలి సంతాపం

- Advertisement -

సభలో అడుగు పెట్టిన విజయశాంతి, ఏడుగురు కొత్త సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి మాజీ సభ్యులు టి.రత్నాకర్‌, తెలంగాణ శాసనమండలి మాజీ సభ్యులు ఎం.రంగారెడ్డిల మరణం పట్ల రాష్ట్ర శాసనమండలి సంతాపం తెలిపింది. ఈ మేరకు శనివారం శాసనమండలి సమావేశాల మొదటి రోజున మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంతాప తీర్మాన్ని ప్రవేశపెట్టారు. జనగామ జిల్లా జనగామ గ్రామానికి చెందిన రత్నాకర్‌తో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.రంగారెడ్డిలు ఈ ఏడాది మరణించినట్టు తెలిపారు. అంతకుముందు వారిద్దరు వివిధ హౌదాల్లో ప్రజా సేవలందించడంతో పాటు ఎమ్మెల్సీలుగానూ సేవలందించినట్టు వివరించారు. సంతాప సూచకంగా సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కొత్త సభ్యులను సభకు పరిచయం చేశారు. శనివారం నాటి సభకు ఇటీవల ఎన్నికై వచ్చిన వారిలో అద్దంకి దయాకర్‌, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, విజయశాంతి, నెల్లికంటి సత్యం, పింగిలి శ్రీపాల్‌ రెడ్డి, అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రియాజుల్‌ ఎఫెండీ ఉన్నారు. వీరిలో ఎంఐఎం పార్టీకి చెందిన రియాజుల్‌ ఎఫెండీ గతంలో ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆయన రెండోసారి ఎన్నికై సభకు హాజరయ్యారు. మిగిలిన వారు మొదటిసారిగా ఎన్నికై సభకు హాజరయ్యారు. అనంతరం చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -