స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
అందరికీ ఆహ్వానం : స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివసేనారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ నెల 28వ తేదీ (శనివారం) హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రారంభం కానున్న ఫస్ట్ ఎడిషన్ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2026 కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడల పట్ల అవగాహన తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న శాసనసభ్యుల క్రీడోత్సవ పోటీలను ఘనంగా నిర్వహించబోతున్నామనీ, తద్వారా రాష్ట్రంలో క్రీడల పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించబోతున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహించబోతున్న ఈ క్రీడా పోటీల్లో పార్టీల భేద భావాలు లేకుండా, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు భాగస్వామ్యం అవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో టగ్ ఆఫ్ వార్, ఫుట్ బాల్, క్రికెట్ అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌తో పాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఈ పోటీలు వీక్షించడానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించబోతున్నామనీ, అందరికీ అవసరమైన సౌకర్యాలను సమకూర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా శాసన సభ్యుల క్రీడోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



