Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంలేహ్‌ ఉద్యమనేత వాంగ్‌చుక్‌ అరెస్టు

లేహ్‌ ఉద్యమనేత వాంగ్‌చుక్‌ అరెస్టు

- Advertisement -

ఉద్రిక్తతలకు కారకుడంటూ పర్యావరణవేత్తపై కేసు
ప్రజల డిమాండ్‌ వదిలేసి.. బలిపశువు చేశారు : వాంగ్‌చుక్‌
నిషేధాజ్ఞల నీడలో జనం

లడఖ్‌ : లడఖ్‌ రాజధాని లేV్‌ాలో చోటుచేసుకున్న అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం వాంగ్‌చుక్‌ ప్రకటనలతోనే లేV్‌ాలో హింసాత్మక ఘట నలు జరిగాయని ఇటీవల కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 90 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

లైసెన్స్‌ ఇప్పటికే రద్దు
లడఖ్‌ను ఆరో షెడ్యూల్‌ కింద చేర్చాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విషయంలో కొద్ది రోజులుగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఈ పరిస్థితికి వాంగ్‌చుక్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 24 గంటలు తిరగకముందే ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ది స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూమెంట్‌ ఆఫ్‌ లడఖ్‌’ పై చర్యలు చేపట్టింది. ఎన్జీవో పనితీరులో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల నియంత్రణ చట్టం నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో లైసెన్స్‌ రద్దు చేసింది. ఈ హింసకు కారణమ య్యారన్న ఆరోపణలపై 50 మందిని పోలీ సులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

బలిపశువు చేశారు
హోంమంత్రిత్వ శాఖ లఢఖ్‌ ఆందోళనకు మూలకారణంగా తన పేరు ప్రస్తావించడాన్ని వాంగ్‌చుక్‌ తప్పుబట్టారు. అసలు సమస్యను పక్కనపెట్టిన తనను బలిపశువును చేశారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం తెలివైన నిర్ణయం కాదన్నారు. స్థానిక యువత భావోద్వేగంతో ఉన్నారని ఓ జాతీయ మీడి యాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆరేండ్లుగా ఉన్న నిరుద్యోగ సమస్య, అమలు కాని హామీలే ఆందోళ నకు మూల కారణమని చెప్పారు. శాంతిని పునరుద్ధ రించేం దుకు చర్యలు చేపట్ట కుండా బలిపశువు వ్యూహం అమలు చేయడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.

పరిస్థితి మరింత తీవ్రతరం : సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిట్టాస్‌
వాంగ్‌చుక్‌ అరెస్టును సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తీవ్రంగా ఖండించారు. ఈ అణచివేత చర్య పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘సోనం వాంగ్‌ చుక్‌ అరెస్టును, లడఖ్‌ ప్రజలపై జరిగిన క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నలుగురు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడ్డం విషాదకరం. ఇటువంటి అణచివేత చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. అశాంతిని మరింత పెంచుతాయి. ఈ హింసను తక్షణమే ముగించాలని, లడఖ్‌ నాయకులతో నిజాయితీగా చర్చలు జరపాలని, దుఖిస్తున్న కుటుంబాలకు పరిహారంతో న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాను’ అని బ్రిట్టాస్‌ పోస్టులో తెలిపారు.

లడఖ్‌లో పరిస్థితులు ఇలా!
లడఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. రాజధాని లేV్‌ాలో దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలు పహారా కాస్తున్నాయి. శాంతి భద్రతలపై లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కవీందర్‌ గుప్తా గురువారం సమీక్ష నిర్వహించారు. దుకాణాలు మూసివేతతో నిత్యావసర వస్తువులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు, రవాణా సేవలను నిలిపివేశారు. తినడానికి ఆహారం కూడా దొరక్కట్లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ రేషన్‌ దుకాణాలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వారాలుగా నిరాహార దీక్ష
లడఖ్‌లో కొంతకాలంగా రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు బుధవారం హింసాత్మ కంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు మూడేండ్లుగా నిరసిస్తున్నారు. అదే సమయంలో తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ రెండు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -