రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘లెనిన్’ చిత్రం బృందం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రామ్‌చరణ్‌తో అఖిల్ అక్కినేనికి, మేకర్స్‌కి ఉన్న అనుబంధం కారణంగా సహదయంతో ‘లెనిన్’ సినిమాని వాయిదా వేశారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉన్న ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నారు. పరస్పర గౌరవంతో పాటుగా, ఎక్కువ సంఖ్యలో థియేటర్ల లభ్యత, సానుకూల వాతావరణాన్ని ‘పెద్ది’కి కల్పించేందుకు ‘లెనిన్’ బృందం విడుదలను వాయిదా వేసింది. ‘లెనిన్’ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు.
బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అత్యుత్తమ రూపంలో అందించి, ప్రేక్షకులకు చిరస్మర ణీయమైన సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తామని చిత్ర బృందం హామీ ఇస్తోంది. ‘లెనిన్’ కోసం వెయిట్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ, సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్, మ్యూజిక్ : తమన్, ఎడిటర్: నవీన్ నూలి, డీఓపీ : లియోన్ బ్రిట్టో, ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్లా.
‘పెద్ది’ కోసం ‘లెనిన్’ వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



