Thursday, April 9, 2026
E-PAPER
Homeసినిమా'లెనిన్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లెనిన్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో అఖిల్‌ అక్కినేని ‘లెనిన్‌’గా రాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మనం ఎంటర ్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ డిఫరెంట్‌ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్‌తో మంచి బజ్‌ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్‌ సినిమాటిక్‌ ప్యాకేజీగా ఈ సినిమ రూపుదిద్దుకుంటోంది.
బుధవారం అఖిల్‌ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.
ఆయనకు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ ఈ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్‌ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత అట్రాక్టివ్‌గా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని క్రియేట్‌ చేసిన ఈ చిత్రం జూన్‌ 26న విడుదల కానుంది.
మురళీ కిషోర్‌ అబ్బూరు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్‌ ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌తో సినిమా నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్తుందని టీం చెబుతోంది. అభిమా నులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేలా ‘లెనిన్‌’ మూవీని తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -