Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగొర్రెల మందపై చిరుత దాడి.!

గొర్రెల మందపై చిరుత దాడి.!

- Advertisement -

ఒక గొర్రె మృతి, మరో గొర్రెకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మహముత్తారం మండలంలోని జీలపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి రామయ్య అనే గొర్రెల కాపరి రోజులాగే తన గొర్రెలను మేతకు తీసుకపోయి శుక్రవారం సాయంత్రం ఉరి చివరలో తన పత్తి చెను వద్దవున్న దొడ్డికాడికి 150 గొర్రెలు తీసుకొచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి గొర్రెల మందపై చిరుతపులి దాడి చేయడంతో కేకలు వేసినట్లు తెలిపాడు.ఇంతలోనే చిరుత ఒక గొర్రెను తీవ్రంగా గాయపరిచి, మరో గొర్రెను చెట్టుపైకి ఊడ్చుకిపోయి రక్తం, మాంసం తిని కాళేబరాన్ని వదిలినట్లుగా తెలిపాడు. చిరుత దాడి చేయడంతో మూడు గొర్రెలు బయానికి పారిపోయాయని,గాయపడిన గొర్రెకుడా ప్రాణాపాయంలో ఉన్నట్లుగా తెలిపాడు.

జరిగిన సంఘటనపై శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏప్ఆర్ఓ స్వాతి ఆధ్వర్యంలో చనిపోయిన, గాయపడిన గొర్రెలను పరిశీలించి, పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. చిరుత పాదముద్రణలు పరిశీలించారు. చిరుత గొర్రెలమందపై దాడితో చుట్టూ ప్రక్క గ్రామాల ప్రజలు, రైతులు, పశు కాపర్లు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవులకు వెళ్లవద్దని, వహిరుట పాదముద్రణల ఆనవాళ్లు కనిపిస్తే పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారెస్ట్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -