Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మరోసారి యన్మంగండ్ల ప్రాంతంలో చిరుత పులి సంచారం 

మరోసారి యన్మంగండ్ల ప్రాంతంలో చిరుత పులి సంచారం 

- Advertisement -
  • – రెండు దూడలను చంపడంతో ఆంధోళనలో రైతులు 
    నవతెలంగాణ – నవాబు పేట

    మండల పరిధిలోని యన్మన్గండ్ల గ్రామ శివారులోని దేవరగుట్ట సమీపంలో చిరుత సంచారం చేస్తూ చుట్టుపక్కల రైతులను భయభ్రాంతులకు గురిచేస్తు దూడలను మేకలను చంపి తింటూ గత నెల రోజులుగా ఆ ప్రాంతంలో ఉండే రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. గురువారం రాత్రి రెండు దూడలను చంపడంతో ఆంధోళనలో ఉన్నారు. తమ ప్రాణాలకు హాని ఉందని ఏం సమయంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నామని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులు సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు. సంబంధించిన ఫారెస్ట్ అధికారులు గత నెలలో బోన్ ఏర్పాటుచేసిన అక్కడ చిరుత పట్టుబడలేదని తిరిగి బోన్ను తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన చిరుత లేదని ఊపిరి పీల్చుకోవడంతో మరోసారి గురువారం జరిగిన ఘటన పై మరోసారి రైతులు ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనా చిరుతలను బంధించి చిరుత నుంచి తమ సంచరించే ప్రాంతాలలో లేకుండా అడవుల్లో వదిలేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకపోతే వాటి నుంచి తమకు కూడా హాని జరిగే అవకాశాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు స్పందించి వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad