– భయాందోళనలు గ్రామస్తులు..
– పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం చిరుత పులి సంచరించినట్టు గ్రామానికి చెందిన పలువురు రైతులు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొడ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్ గ్రామస్తులకు అప్రమత్తం చేసి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల తో కలిసి సంచరిస్తున్న ప్రదేశంలో అన్వేషించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిపారు. గుర్తించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. చిరుతపులి రోజుకో ఊరు.. రోజుకో ప్రదేశం… సంచరిస్తూ అధికారులు ప్రజల కళ్ళు కప్పి ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.
ఇప్పటికే మొదటగా దోస్త్ పల్ ఒక జీవిత పులి మృత్యువాత పడ్డ సంఘటన పాఠకులకు తెలిసిందే. నాటీ నుండి బంగారు పల్లి , డోన్గావ్ , పెద్దగుల్ల , పెద్ద ఏడ్గి , మైబాపూర్ , శక్తి నగర్, శివార్లలో సంచరించినట్లు గుర్తించినాము. నాటి నుండి కదలికలను గమనిస్తూనే ఉన్నాం. నెలరోజుల నుండి నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు కొనుక్కుతియకుండా అన్వేషణ కొనసాగిస్తున్నామని అయినా తమ కంటపడడం లేదని అధికారులు తెలిపారు. ఆదివారం రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో సావర్ గావ్ మైసమ్మ గుడి వద్ద కనిపించిందని గిరిజన వాసులు తెలిపారు. ఆదివారం నాడు రాత్రి పది గంటలకు వజ్రఖండి రోడ్డుపై కనిపించినట్టు గ్రామస్తులు తెలిపారని ఫారెస్ట్ బీట్ అధికారి రాములు తెలిపారు.
సంచరిస్తున్న చిరుత పులి ఆడ పులి కావడం దానితోపాటు రెండు పిల్ల కూనలు దాని వెంటపెట్టుకొని తిరుగుతుందని పాదముద్రలను చూసి గుర్తించినామని చెప్పారు. ఇప్పటికైనా గ్రామాలలోని రైతులు , పశువుల కాపర్లు , కూలీలు వ్యవసాయ పనులుకు వెళ్తున్న క్రమంలో అక్రమత్తంగా ఉండాలని పొద్దు పోయేవరకు నిర్మానుష ప్రాంతాలలో, వ్యవసాయ శివారులు ఉండకూడదని సూచించారు.



