Sunday, May 18, 2025
Homeకవితనిరుత్సాహాన్ని వీడి…తొలి అడుగు వేయండి

నిరుత్సాహాన్ని వీడి…తొలి అడుగు వేయండి

- Advertisement -

ఈ ప్రపంచ వేదికపై
మిమ్మల్ని నిలిపే శక్తి మీలోనే ఉంది.
కానీ… దురదష్టవశాత్తూ
మీరు ఆ శక్తిని నమ్మడం మర్చిపోయారు.
ప్రతి రోజు మన సొంత సామర్థ్యాన్ని
మనమే అనుమానిస్తుంటాం.
ఎవరైనా సహాయం చేస్తే బాగుండు..
ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు
అని వేచి చూస్తూ కాలాన్ని వథా చేస్తుంటాం.
కానీ నిజం ఏమిటంటే
ఈ ప్రపంచం ఊరికినే సహాయం చేయదు.
మనకు మనమే సహాయం చేసుకోవాలి.
ఈ ప్రపంచం ఉచితంగా అవకాశాలు ఇవ్వదు.
మన అవకాశాలను మనమే సష్టించుకోవాలి.
మీరు మీలోని బలహీన అనుమానాల హద్దులను దాటి
ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు
ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి.
ఆ క్షణం మీ భయం మీ శక్తిగా మారిన క్షణమై
మీ జీవితం… లక్ష్యం వైపు సాగిపోతుంది.
నిరుత్సాహాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో
ఈరోజే, ఈ క్షణమే…
మీ లక్ష్యం వైపు వేయండి మీ తొలి అడుగు.
ఒకరోజు… ఈ తొలి అడుగే
మీ జీవితాన్ని మార్చిన మధుర జ్ఞాపకమై
ప్రేరణగా నిలుస్తుందిఇంకొకరికి.
ఇది సత్యం, ఇదే సత్యం
ఇంకెందుకు ఆలస్యం? మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి
మీ తొలి అడుగును వేయండి ఈరోజే.
-ననుబోలుహొరాజశేఖర్‌, 9885739808

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -