సైకియాట్రిస్ట్ వైద్యులు రమణ
నవతెలంగాణ – రామారెడ్డి
పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు భయానివీడి పరీక్షలకు హాజరై, ప్రతిభను కనబరిచి, మెరుగైన ఫలితాలను సాధించాలని ప్రముఖ సైకియాట్రిస్ట్ వైద్యులు రమణ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ… విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఏర్పడే మానసిక భయంతోలనలు, ఒత్తిడీలు, ఆందోళనలు ఎలా అధిగమించాలో సులభమైన పద్ధతిలో వివరించారు. మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్లను అతిగా వినియోగించకూడదని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై పూర్తి దృష్టి పెట్టి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు సురేష్, వైద్యులు రమ్య, వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
భయం వీడి పరీక్షలకు హాజరై, ప్రతిభను కనపర్చాలి
- Advertisement -
- Advertisement -



