జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు
తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తేవాలి..
జె వి వి జిల్లా అధ్యక్షులు కోయడ నర్సింహులు డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రశ్న ప్రగతికి మూలం మూఢత్వ నంద విశ్వాసాలను వీడండి అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు తెలిపారు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న మరో దిక్కు అంద విశ్వాసాలతో గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రశ్నించి, పోరాడినందుకు మతోన్మాదులు డాక్టర్ నరేంద్ర డబోల్కర్ ను ఈ రోజు హత్య చేశారు. అందుకే ఈ రోజు జాతీయ వైజ్ఞానిక దృక్పధ దినోత్సవముగా జరుపుకుంటున్నామని
దానిలో భాగంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కాలనీ లోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లో అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించడం జరిగిందని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయడ నర్సింహులు తెలిపారు.మూఢ నమ్మకాల నిర్ములనా చట్టాన్ని ప్రభుత్వం తీవాలని అన్నారు.ముఖ్య వక్త జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ ప్రతీది ప్రశ్నించాలని, ప్రశ్నయే ప్రగతికి మూలమని గుడ్డిగానమ్మకుండా హెతుభద్ధంగా ఆలోచించడం నేర్చుకోవాలని ప్రాక్టీకల్గా మ్యాజిక్స్ చేసి చూహించారు.
అందరు రాజ్యాంగంలోని ప్రవేశిక, చట్టాలు, హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. సామాజిక కార్యకర్త కామ్రేడ్ నాగన్న మాట్లాడుతూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలని, కుల, మాతాలకు అంతేతంగా అందరం మానుషులుగా ఐక్యంగా ఉండాలన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుడు సిర్పలింగం ఆలపించిన పాటలు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆలోచింపచేసాయి. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రామాదేవి, శ్రీరామ్,శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.