Tuesday, December 9, 2025
E-PAPER
Homeఖమ్మంనీతి, నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

నీతి, నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
నీతి, నిజాయితీగా రామాభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసే సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోనే చొప్పకట్లపాలెం, చిరునోముల గ్రామాలలో సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ జరిగిన బీఆర్ఎస్, సీపీఐ(ఎం) నాయకుల, కార్యకర్తల, సర్పంచ్ అభ్యర్థుల, వార్డు మెంబర్ల సంయుక్త సమావేశాలు చొప్పకట్లపాలెం, చిరునోములలో మంగళవారం జరిగాయి. ఈ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు పార్టీల ఆధారంగా నిధులు రావని గ్రామపంచాయతీల ఆధారంగా మాత్రమే నిధులు వస్తాయన్నారు.

అధికార పార్టీ నాయకులు అభ్యర్థులు తమకు ఓట్లు వేయకపోతే గ్రామపంచాయతీలకు నిధులు రావని సంక్షేమ పథకాలు ఇవ్వమని బెదిరింపులకు దిగటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సర్పంచిగా ఏ పార్టీ వ్యక్తి ఉన్న గ్రామపంచాయతీలకు నిధులు వస్తాయన్నారు. కాంగ్రెస్ నాయకుల అభ్యర్థుల బెదిరింపులకు మాయమాటలకు ఓటర్లు మోసపోవద్దని నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సేవకులు గా ఉండే సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీ నాయకులను గెలిపిస్తే అధికార దర్పం ప్రదర్శిస్తారని ప్రజలను లెక్కచేయరన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం చేయరన్నారు. కేవలం వారికి అధికార దర్పం తప్ప ప్రజలను పట్టించుకోరు అన్నారు. ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్నది కాంగ్రెస్ నాయకుల సొత్తు కాదని అది రాష్ట్ర ప్రజలందరూ సొత్తు అన్నారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీలకు నిధులు రావని బెదిరింపులకు దిగారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించడం ద్వారానే సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను ఇందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు ఓటర్లకు చెప్పి ఓట్లు అడగాలని అప్పుడే వారి నీతి నిజాయితీ బయటకు వస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకుల సొత్తు కాదన్నారు. తమకు ఓట్లు వేస్తేనే తమ వెంట ప్రచారంలో పాల్గొంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బెదిరించటం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులకు గ్రామాలలో ఓట్లు అడిగే ధైర్యం లేకనే బెదిరింపులకు దిగుతున్నారన్నారు. చిరునోములలో బీఆర్ఎస్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి నిమ్మతోట శైలజ, చొప్పకట్లపాలెంలో సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని కాటేపల్లి అశ్వని విజయం సాధించటం ఖాయమన్నారు.

కాటేపల్లి అశ్విని నిమ్మతోట శైలజ మంచి అభ్యర్థులు అన్నారు. వారి విజయంతోటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సమావేశాలలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు నిమ్మతోట శైలజ, కాటేపల్లి అశ్విని, సీపీఐ(ఎం), బీఆర్ఎస్ నాయకులు చావా వెంకటేశ్వరరావు రావెళ్ల లక్ష్మయ్య గరపాకుల రామకృష్ణ, నిమ్మల రామారావు, నిమ్మ తోట రవి నిమ్మ తోట రమేష్ నిమ్మతోట ఖాన, నీలకంఠం రాము, పంతంగి శ్రీనివాసరావు, నిమ్మతోట దిలీప్ కుమార్ వార్డు మెంబర్లు నిమ్మ తోట మంగమ్మ చాపల మడుగు స్వరూప ముంగి వెంకన్న అల్లిక రంగయ్య గోళ్ళ పరుశురాం, బోడేపూడి కిరణ్, కాటేపల్లి చంద్రశేఖర్, పల్లా కొండలరావు, చలమల హరికృష్ణరావు, ఉన్నం వెంకటేశ్వర్లు, బూసి వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, చలమల అజయ్ కుమార్, బొప్పాల రమేష్, వడ్డే నరేష్, బీఆర్ఎస్, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -