Friday, February 6, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజాస్వామ్య శక్తులను గెలిపించండి

ప్రజాస్వామ్య శక్తులను గెలిపించండి

- Advertisement -

– ఎమ్మెల్యే జారె, కొక్కెరపాటి పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

పని చేసే నాయకత్వం కావాలంటే ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య శక్తులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన 21 వ వార్డు సీపీఐ (ఎం)అభ్యర్థిని తగరం నిర్మల, సీపీఐ (ఎం) బలపరిచిన 12 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని అట్టం (పోకల)రమ్య ల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య లుఆయా వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజమైన అభివృద్ధి సంక్షేమం నిరంతరం జరగాలంటే కాంగ్రెస్, సీపీఐ(ఎం) లు నుంచి పోటీ చేస్తున్న తగరం నిర్మల, అట్టం రమ్య లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు చిరంజీవి, ప్రసాద్, గంగరాజు, కలపాల భద్రం,కేపీ ఇబ్రహీం, కానూరి మోహన్ రావు, తగరం ముత్తయ్య, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -