Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్జాతీయ లోక్ అదాలత్ కు చేయుతనివ్వండి..

జాతీయ లోక్ అదాలత్ కు చేయుతనివ్వండి..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా వ్యాప్తంగా జూన్ మాసంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి చేయుతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి.వి.ఎన్ భరత లక్ష్మీ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో అదనపు జిల్లాజడ్జి హరీష, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు లతో కలిసి బీమా కంపెనీల స్టాడింగ్ కౌన్సిల్స్,అధికారులు,న్యాయవాదులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు.మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలను లోక్ అదాలత్ లో భీమా కంపెనీలు, న్యాయవాదులు ఒక రాజీ పరిష్కారం దిశగా అడుగులు వేస్తే, న్యాయస్థానాలు సహకరించి,సలహాలిచ్చి నష్టపరిహార దావాలను తుదిరూపం తీసుకోవడానికి చేదోడుగా నిలుస్తామని ఆమె అన్నారు.లోక్ అదాలత్ లో రాజీపద్దతిన అవార్డులు అందుకున్న దావాలలో భీమా కంపెనీలు త్వరితగతిన నష్టపరిహార డబ్బులను కోర్టులో డిపాజిట్ చేస్తాయని తెలిపారు. అట్టి డబ్బు మోటారు వాహన ప్రమాదంలోని బాధితులకు చేరుతుందని,అది వారి ఆర్థిక అవసరాలకు పనికి వస్తుందని పేర్కొన్నారు. ముందస్తుగా కేసులను పరిష్కరించుకుంటే భీమా సంస్థలకు ఆర్థిక లబ్ది కూడా చేకూరుతుందని ఆమె తెలిపారు. బాదిత కుటుంబాల ఆర్ధిక నిరీక్షణను అంతం చేసిన వారం కాగలమని జిల్లాజడ్జి తెలిపారు. జూన్ 14 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను నడిపించేది, నడక చూపించేది న్యాయమూర్థులు,న్యాయవాదులేనని ఆమె అన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ భీమా కంపెనీలు కలిసికట్టుగా వస్తే పరిష్కారం కానిదేముందని ఆమె అభివర్ణించారు. బీమా కంపెనీల న్యాయవాదులు, నష్టపరిహార దావాలోని న్యాయవాదులు, భీమా కంపెనీల అధికారులు ఒక అంగీకారానికి వస్తే, న్యాయమూర్తులు చేదోడు వాదోడుగా నిలుస్తారని ఆమె వెల్లడించారు.సమావేశంలో ప్రభుత్వ భీమా కంపెనీల న్యాయవాదులు మంచికట్ల గోవర్ధన్,ఆనంద్ రెడ్డి, అంకిత, గణేశ్ దేశ్పాండే, ఎం.వి.నరసింహ రావు,వి.భాస్కర్, ఆర్.మోహన్,సదానంద్ గౌడ్, న్యాయవాదులు రఘువీర్ భూపాల్, అల్గోట్ రవీందర్, మహేష్,ముత్యాల కృష్ణారెడ్డి, పిట్లం శ్రీనివాస్ ,ప్రభుత్వ రంగస్థoస్థల బీమా కంపెనీలు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ లాలూ వంకదోథ్ ,ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ బోదుకం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -