Saturday, September 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినవ్విపోదురుగాక..

నవ్విపోదురుగాక..

- Advertisement -

బీజేపీ, ఈసీ ఓట్ల చోరీ ముచ్చట గిప్పుడు దేశమంతా ప్రచారం కాబట్టే. ఈవీఎంలను అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా సీట్లను కొల్లగొట్డారనే విమర్శలు ఎన్నో ఎరుకేనాయే. ఊరుపేరు లేనోళ్లకు ఓట్లిచ్చిరి. ఇంటినెంబరు జీరోతో వందల మందికి సిరా ఇంకు పెట్టుకునే అవకాశమిచ్చిరి. ఒక్కో ఇంట్లో వందల ఓట్లు. ఇంకో ముచ్చట చెప్పనా? బతికినోళ్లనూ సచ్చినోళ్ల కింద జమకట్టి ఓట్లను కట్‌ చేసే. ఇంకో ముచ్చట ఏమంటే బెంగళూరు ఉదాహరణతో ఓట్ల చోరి దందా గుట్టు ఇప్పిన రాహుల్‌గాంధీకి అభినందనల వర్షం కురవబట్టే. ఎప్పటిలాగే ఈసీ, గోడీ మీడియా చెవులుండి ఇనకపాయే. కండ్లుండి సూడకపోయే. ఈసీ అయితే ఏకంగా అఫిడవిట్‌ అడిగిందాయే. ఇన్నీ వింతలు చూస్తూ ఈసీ మాత్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే తరహాలో కనిపిస్తుండే. ఓట్ల తిరస్కరణకు కారణాలు చెబుతూ పబ్లిక్‌ డొమైన్‌లో జాబితాలు పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించడం చెంపపెట్టే.
– బి.బసవపున్నయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -