Thursday, May 8, 2025
Homeట్రెండింగ్ న్యూస్సైనిక దళాలకు మనమంతా మద్దతుగా నిలుద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

సైనిక దళాలకు మనమంతా మద్దతుగా నిలుద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ : పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకార చర్యల్లో భారత సైనిక దళాలు చేస్తున్న యుద్ధ పోరాటానికి రాష్ట్ర దేశ ప్రజలంతా సైనిక దళాల వెంటే ఉన్నారని రాష్ట్ర ఐటి శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం షాద్నగర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత శాంతి సామరస్యతల విషయంలో భారత సైనిక దళాలు ప్రాణ త్యాగాలకు ఓర్చీ ముందుకు సాగుతున్నారని, ఇది దేశ ప్రజలకు ఎంతో గర్వకారణం అని, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడుతూ.. దేశ రక్షణ కోసం జరుగుతున్న యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.  రాష్ట్ర ప్రజలు అందరూ భారత ప్రభుత్వం వెంటనే ఉంటారని అన్నారు.  పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైనిక దళాల పరాక్రమానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.  దేశ సమగ్రత కాపాడడం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో తమ పార్టీ పూర్తిగా  సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు . దేశంలో రాజకీయాల పరంగా సిద్ధాంతాల పరంగా వేరైనా దేశ సమగ్రతను శాంతి సామరస్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, తమ నేత రాహుల్ గాంధీ భారత ప్రభుత్వానికి మద్దతు పలికారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరం అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశమే ముఖ్యం.. దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చశారు. దేశ సైనిక పోరాటాలు మనందరికీ గర్వకారణమని, సైనిక దళాలకు మనమంతా మద్దతుగా నిలుద్దామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -