ఏఎంసీ చైర్పర్సన్ తిరుమల
నవతెలంగాణ–కాటారం
సమ సమాజ స్థాపనతో పాటు మహిళా విద్యా వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావ్ పూలే అందరికీ ఆదర్శప్రాయుడని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ పంతకాని తిరుమల పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా శనివారం కాటారం ఏఎంసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుమల మాట్లాడుతూ…
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడంలో పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటి యువత మహాత్ముని ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరావు, పిల్లమరి రమేష్, రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అంగూత్ సుగుణ, డీసీసీ జనరల్ సెక్రటరీ కుంభ స్వప్న, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ తదితర నాయకులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.



